KRNL: మంత్రాలయం పట్టణంలో ఈ నెల 28న నిర్వహించనున్న నేషనల్ కెరీర్ సర్వీస్ జాబ్ మేళాకు సంబంధించిన పాంప్లెట్లను టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఇవాళ విడుదల చేశారు. 17 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాకు హాజరుకానున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలను సాధించాలన్నారు.