TG: ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు స్నేహితులు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.