బీహార్ ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. సీఎం రేసులో తాను లేనని తేల్చి చెప్పారు. అయితే సీఎం ఎంపికపై మాత్రం కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మిత్రపక్షాల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.