W.G: జిల్లాలో నెలకొన్న సమస్యలపై CPM చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. కామ్రేడ్ భగత్ సింగ్ ఏదైతే ఆనాడు ప్రజలకు దక్కాలని కోరుకున్నారో అవేవీ నేడు ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి పెన్షన్ ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.