SRPT: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.