BPT: అద్దంకి నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ ఇంఛార్జ్, రాష్ట్ర పొలిటికల్ ఎఫెన్స్ కమిటీ సభ్యురాలు మీసాల సామ్రాజ్యం సోమవారం కలెక్టర్ కార్యాలయం నందు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలన్నారు.