SRD: విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు.