JN: బచ్చన్నపేట మండలం తమ్మదపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే పోచమ్మ గుడి నిర్మాణానికి గ్రామానికి చెందిన మట్టి శ్రీనివాస్, మట్టి బాలరాజు, మట్టి నరేష్ అన్నదమ్ములు తమ వంతు విరాళంగా రూ.25 వేల అందించి వారి దైవ భక్తిని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. నిర్మాణానికి తమ వంతు కానుక అందించడం సంతోషం అన్నారు. అమ్మవారి దీవెనలతో గ్రామ ప్రజలు చల్లంగా ఉండాలని కోరారు.