సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను కలిసి తమ ప్రాంత సమస్యలపై ఇవాళ వినతులు అందజేశారు. ప్రజల సమస్యలను ఆత్మీయంగా విన్న మంత్రి వినతిపత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.