యూజర్ల డేటా భద్రత దృష్ట్యా ChatGPT, జెమిని వంటి విదేశీ AIలను రష్యా నిషేధించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. 5 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న ప్లాట్‌ఫామ్‌లు డేటాను మూడేళ్ల పాటు రష్యాలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. డేటా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ కఠినమైన చర్యలు తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.