MBNR: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. చికిత్స కోసం వచ్చిన ఆరుగురు రోగులపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో వారికి తీవ్ర రక్తస్రావమైంది. ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రోగుల భద్రత గాలికి వదిలేశారని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.