వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్లో కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. మే నాటికి షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన క్రైమ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.