NLG: జిల్లాలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టూవీలర్ ఉండి, కారు కొంటే ఇప్పటివరకు వసూలు చేస్తున్న 2% అదనపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నూతన విధానంతో ‘వాహన్’ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎలాంటి అదనపు భారం లేకుండా వాహనాలు కొనుగోలు చేయొచ్చు అన్నారు.