W.G: ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నియమాకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత సీఐ జగదీశ్వరరావుపై క్రమశిక్షణ చర్యల అనంతరం, 20 రోజులుగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పూర్తిస్థాయి అధికారిని నియమించడంలో జాప్యం జరుగుతుండటంతో తదుపరి సీఐ ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Tags :