AP: వంటగ్యాస్ కొరత దృష్ట్యా ఏపీలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల రేషన్ కార్డుదారులకు ఇవాళ్టి నుంచి లీటరు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. కేంద్రం కేటాయించిన 28 లక్షల లీటర్లను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రాన్ని గతంలో కిరోసిన్ రహితంగా ప్రకటించినా, ప్రస్తుత ఇబ్బందుల వల్ల మళ్లీ సరఫరా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.