పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తామని ప్రకటిస్తూ.. విజయ్ TVK పార్టీ 30 స్థానాలకు అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశమిచ్చారు. పుదుచ్చేరిలో TVK నిర్మాణంపై ప్రత్యేక దృష్టితో విజయ్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.