కోనసీమ: శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గోదావరి సెంట్రల్ డెల్టా ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రాజోలు మండలం పొన్నమండలో ఆయన మాట్లాడుతూ.. శెట్టి బలిజల సంక్షేమానికి వెంకటరెడ్డి విశేష కృషి చేశారన్నారు. ప్రభుత్వం మంచి గుర్తింపునిచ్చిందని అన్నారు.