ప్రకాశం: అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో గల వడ్డే కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్థవీడు ఎస్సై శివ నాంచారయ్య, కంభం ఎస్సై శివకృష్ణ రెడ్డి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.