ADB: రైతు భరోసా మొదటి విడత డబ్బులు విడుదల చేసిన నేపథ్యంలో బేల మండలంలోని సాంగిడి గ్రామంలో CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. CM రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు.