BDK: భానుడి భగభగలకు మనుషులే కాదు, మూగజీవాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అటు కోతుల్లో, ఇటు వీధి కుక్కల్లో విపరీతమైన మార్పులకు కారణమవుతున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు ఇవి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.