AP: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోరుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇదే క్రమంలో విమల విద్యాలయం మూసివేత వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరగా, కేంద్రమంత్రి సానుకూల హామీ ఇచ్చారు.