TG: అసెంబ్లీలో బడ్జెట్‌పై కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లుతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్, ఉద్యోగుల పే స్ట్రక్చర్ సవరణ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరగనున్నాయి.