MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు BJP నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం సమంజసం కాదని నాయకులు అన్నారు.