కోనసీమ: అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహారంలో విద్యుత్ షాక్ కారణంగా ఓ ఆవు మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక అపార్ట్మెంట్ ప్రహరీ వద్ద ఎర్త్ వైర్ ద్వారా విద్యుత్ ప్రవహించడంతో ప్రహరీని ఆనుకుని వెళ్లిన ఆవు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.