VSP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన పలు కీలక సమస్యలపై చర్చించారు. ప్రధానంగా విమల విద్యాలయం మూసివేత వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, విద్యార్థుల భవిష్యత్తును మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.