GNTR: పదవ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం గుంటూరు పట్టణంలో గల హిందూ పాఠశాలలో తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పరీక్షల సమయంలో చుట్టుప్రక్కల జిరాక్స్ మెషిన్ దుకాణాలు మూసివేయడం అంశాలను గురించి వాకబు చేశారు.