‘ధురంధర్ 2’ విజయంతో నటుడు గౌరవ్ గేరా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1998లో కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల గురించి తల్లిదండ్రులకు రాసిన లేఖను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ముంబై వచ్చిన కొత్తలో భవిష్యత్తుపై స్పష్టత లేకున్నా, ఆశ కోల్పోకుండా TV, సినిమాలు, రీల్స్ వరకు సాగిన తన ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.