కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఉమ్మడి చట్టాన్ని ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అధికారుల నియామకం, డిప్యూటేషన్, ప్రమోషన్, సర్వీస్‌కు సంబంధించిన ఇతర అంశాల నియంత్రణకు చట్టం తేనున్నారు. ఈ చట్టాల్లోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-ఎ జనరల్ డ్యూటీ అధికారుల నియామకం, సర్వీసు మార్గదర్శకాలు ఉండనున్నాయి.