దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన సంస్థలు డిమాండ్‌ను బట్టి తమకు నచ్చినట్లుగా టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు. పశ్చిమా ఆసియాలో ఉద్రిక్తత కారణంగా విమాన సర్వీసుల నిర్వహణ భారంగా మారిందని.. వారికి ఊరటనిచ్చేలా పరిమితులను తొలగించింది. దీంతో విమాన ప్రయాణం ఖరీదు కానుంది.