BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక ఐటీసీ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించారు. 13వ వేతన ఒప్పందం పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం జేఏసీతోనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.