KMM: ఏన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 29న దివ్యాంగుల కోసం భారీ ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం పాఠశాలను సందర్శించిన పూర్వ విద్యార్థులు, ఈ కార్యక్రమ పోస్టర్లను ప్రిన్సిపల్‌తో కలిసి విడుదల చేశారు. శారీరక సమస్యలు, వైకల్యంతో బాధపడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.