AP: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారితో MLC నాగబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. ఏ ఆపద వచ్చినా జనసేన, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సౌదీ, యూఏఈ, ఖతార్ తదితర దేశాల్లోని భారతీయులు ధైర్యంగా ఉండాలని, పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆయన ఆకాంక్షించారు.