VZM: రాజాం మండలం అంతకాపల్లి-మొగిలివలస నుంచి సారథి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు మొక్కజొన్న పిక్కలను ఆరబెడుతున్నారు. దీంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగిరి గుయ్యన్నవలస రహదారిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.