Nitish Kumar: నితీశ్‌కు తప్పిన ప్రమాదం.. బైక్ యాక్సిడెంట్ నుంచి ఎస్కేప్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లగా ఇద్దరు బైకర్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. వారిని గమనించి ఫుట్ పాత్‌పై దూకడంతో ప్రమాదం తప్పింది.
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మార్నింగ్ వాక్ కోసం ఈ రోజు ఉదయం పాట్నాలో ఇంటి నుంచి బయటకు వచ్చారు. సర్క్యులర్ రోడ్డు వైపు నితీశ్ కుమార్ (Nitish Kumar) వస్తుండగా.. ఇద్దరు రెండు బైక్‌లపై వచ్చారు. నితీశ్ సెక్యూరిటీని ధాటి సమీపంలోకి వచ్చారు. గమనించిన నితీశ్ కుమార్ (Nitish Kumar) వెంటనే ఫుట్ పాత్పైకి దూకారు. రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సీఎం మార్నింగ్ వాక్ చేస్తుండగా భద్రత వైఫల్యం బయటపడింది.
నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్నింగ్ వాక్కు రాగానే భద్రతా సిబ్బంది వెంట పరుగు తీశారు. భద్రత వలయాన్ని దాటి రావడం కలకలం రేపింది. ఆ తర్వాత పారిపోతున్న ఇద్దరు బైకర్లను పట్టుకుని, విచారిస్తున్నారు. నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్నింగ్ వాక్ చేసు చోట సీసీటీవీ ఫుటేజీ కూడా పరిశీలించారు. పొరపాటున జరిగిందా..? ఢీ కొట్టాలనే చేశారా అనే అంశాలపై విచారణ జరుగుతుంది.
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ఎస్జీ కమాండ్స్, పట్నా ఎస్పీని నితీశ్ కుమార్ (Nitish Kumar) తన ఇంటికి పిలిపించారు. బైకర్ల గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. సర్క్యులర్ రోడ్డులో వీవీఐపీలు ఉంటారు. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఇతర ప్రముఖలు నివాసాలు కూడా ఉంటాయి. ఆ రోడ్డులో ఇద్దరు ఆగంతకులు రావడం.. ఏకంగా సీఎంను ఢీ కొట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.