KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా మధ్యాహ్న భోజన వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, జిల్లా కార్యదర్శి కొండ రజితలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య విమర్శించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.