TG: ఇవాళ సచివాలయంలో ప్రకృతి వ్యవసాయ రైతులకు ప్రభుత్వం కిట్ల పంపిణీ చేయనుంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా ఎంపికైన రైతులకు అందించనుంది. గుర్తింపు కార్డులతో పాటు ఇతర వస్తువులను ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 489 ప్రకృతి వ్యవసాయ సమూహల్లో కిట్ల పంపిణీ జరగనుంది. ప్రతి క్లస్టర్ 125 మంది చొప్పున మొత్తం 61,125 మంది రైతులకు కిట్లు అందించనుంది.