NTR: విజయవాడ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో 88 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.