TG: ఇవాళ, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ నెల 20న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ తరపున శాసనసభలో మాజీమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చించనున్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడనున్నారు.