ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల నటి జాన్వీ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియాలో అతనితో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ నివాళులు అర్పించింది. షూటింగ్ సెట్స్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ప్రతిరోజూ అతనిని మిస్ అవుతానని పేర్కొంది. గత రెండేళ్లుగా తన ప్రయాణంలో మార్స్ కీలక భాగమని, అతని మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసింది.