TPT: ఉగాది పండుగ సందర్భంగా తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.