JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. ఆలయ ఆవరణలో ఉదయం 10 గంటలకు హుండీలు విప్పి భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు.