E.G: రాజమండ్రికి చెందిన చిత్రకారుడు హరి తాడోజకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందజేసింది. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో CM చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ గౌరవం అందుకున్నారు. చిత్రకళలో విశేష ప్రతిభ కనబరుస్తూ, ఎందరికో ఈ విద్యను నేర్పిస్తున్న హరికి పురస్కారం లభించడం పట్ల కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.