PPM: సాలూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పాలకవర్గ గడువు ముగియడంతో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన ఆనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.