రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా పడుతుందన్న వార్తలపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమాని ఏప్రిల్ 30న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా US బుకింగ్స్ కూడా అదే రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండటంతో, అది పూర్తయ్యాక పెండింగ్ ఉన్న స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు.