WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి ఉదయ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ గుర్తింపు కార్డులతో వైద్య శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.