కర్నూలు: రైల్వే సమస్యలను ఎంపీ బస్తిపాటి నాగరాజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించారు. పంచలింగాల సమీప నిర్మాణంలో ఉన్న మిడ్ లైఫ్ కోచ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు ప్రారంభించాలని తెలిపారు. అలాగే పలు స్టేషన్లలో నిలిపివేసిన రైలు స్టాపులను పునరుద్ధరించి, డబుల్ ట్రాక్ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.