ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై బొజ్జి రావు సోమవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. లైసెన్స్, సరైన పత్రాలు లేకుండా ప్రయాణించినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.