NZB: TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ (BA/BCom/BSc/BBA) 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30లోపు పరీక్షల ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. పరీక్షలను ఏప్రిల్/మే నెలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.