KMM: ఖమ్మం నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. అనివార్య కారణాలతో మంగళవారం జరగాల్సిన ఈ భేటీ వాయిదా పడింది. సుమారు రూ. 196.40 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు వార్షిక బడ్జెట్ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ప్రతులను అధికారులు ఇప్పటికే కార్పొరేటర్లకు అందజేశారు.