SKLM: హలో శ్రీకాకుళం సోషల్ మీడియా యువత మానవత్వంతో స్పందించి, షణ్ముఖరావు చికిత్సకు మూడు లక్షల పదివేల రూపాయలు అందజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న షణ్ముఖ సాయి చికిత్స కోసం గ్రామస్తులు, హలో శ్రీకాకుళం ఇంస్టాగ్రామ్ పేజీ యువత కలసి మానవత్వంతో ముందుకు కదిలారు. ఇందులో పాత్రునివలస గ్రామ మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.